|
|
|
Sri Lalitha Sahasranama Stotram – శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
అస్య శ్రీలలితాసహస్రనామస్తోత్రమహామంత్రస్య వశిన్యాదివాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీలలితాపరమేశ్వరీ దేవతా, శ్రీమద్వాగ్భవకూటేతి బీజం, మధ్యకూటేతి శక్తిః, శక్తికూటేతి కీలకం, మూలప్రకృతిరితి ధ్యానం, మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ | మమ శ్రీలలితామహాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధిద్వారా చింతితఫలావాప్త్యర్థే జపే వినియోగః |
ధ్యానమ్ |
సిందూరారుణవిగ్రహాం త్రిణయనాం మాణిక్యమౌళిస్ఫుర-
-త్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహామ్ |
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||
అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |
అణిమాదిభిరావృతాం మయూఖై-
-రహమిత్యేవ విభావయే భవానీమ్ ||
ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||
సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||
లమిత్యాది పంచపూజా |
లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం పరికల్పయామి |
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి |
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై ధూపం పరికల్పయామి |
రం – వహ్నితత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై దీపం పరికల్పయామి |
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై అమృతనైవేద్యం పరికల్పయామి |
సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై సర్వోపచారాన్ పరికల్పయామి |
అథ స్తోత్రమ్ |
శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || 1 ||
ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా |
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 ||
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా |
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా || 3 ||
చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా || 4 ||
అష్టమీచంద్రవిభ్రాజదలికస్థలశోభితా |
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా || 5 ||
వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా || 6 ||
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా || 7 ||
కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || 8 ||
పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా || 9 ||
శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా || 10 ||
నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ |
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా || 11 ||
అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా |
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా || 12 ||
కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా |
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా || 13 ||
కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ |
నాభ్యాలవాలరోమాలిలతాఫలకుచద్వయీ || 14 ||
లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా |
స్తనభారదలన్మధ్యపట్టబంధవలిత్రయా || 15 ||
అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ |
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా || 16 ||
కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా |
మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా || 17 ||
ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా |
గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా || 18 ||
నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా |
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా || 19 ||
శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా |
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః || 20 ||
సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా |
శివా కామేశ్వరాంకస్థా శివస్వాధీనవల్లభా || 21 ||
సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా |
చింతామణిగృహాంతఃస్థా పంచబ్రహ్మాసనస్థితా || 22 ||
మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ |
సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ || 23 ||
దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా |
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా || 24 ||
సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా || 25 ||
చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా |
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా || 26 ||
కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా |
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా || 27 ||
భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా |
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా || 28 ||
భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా |
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా || 29 || [విశుక్ర]
విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా | [విషంగ]
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా || 30 ||
మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా |
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ || 31 ||
కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా || 32 ||
కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా |
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా || 33 ||
హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా || 34 ||
కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ |
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ || 35 ||
మూలమంత్రాత్మికా మూలకూటత్రయకలేబరా |
కులామృతైకరసికా కులసంకేతపాలినీ || 36 ||
కులాంగనా కులాంతఃస్థా కౌలినీ కులయోగినీ |
అకులా సమయాంతఃస్థా సమయాచారతత్పరా || 37 ||
మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ |
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ || 38 ||
ఆజ్ఞాచక్రాంతరాలస్థా రుద్రగ్రంథివిభేదినీ |
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ || 39 ||
తటిల్లతాసమరుచిః షట్చక్రోపరిసంస్థితా |
మహాసక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ || 40 ||
భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా |
భద్రప్రియా భద్రమూర్తిర్భక్తసౌభాగ్యదాయినీ || 41 ||
భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా |
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ || 42 ||
శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా || 43 ||
నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా |
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా || 44 ||
నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా |
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా || 45 ||
నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వరా |
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ || 46 ||
నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ |
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ || 47 ||
నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ |
నిఃసంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ || 48 ||
నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ |
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా || 49 ||
నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా |
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా || 50 ||
దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా |
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా || 51 ||
సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా |
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ || 52 ||
సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ |
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్మృడప్రియా || 53 ||
మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ |
మహామాయా మహాసత్త్వా మహాశక్తిర్మహారతిః || 54 ||
మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా |
మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ || 55 ||
మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా |
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా || 56 ||
మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ |
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ || 67 ||
చతుఃషష్ట్యుపచారాఢ్యా చతుఃషష్టికళామయీ |
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా || 58 ||
మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా |
చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా || 59 ||
చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా |
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా || 60 ||
పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ |
చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ || 61 ||
ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా |
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా || 62 ||
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా |
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ || 63 ||
సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ |
సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణా || 64 ||
భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ |
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ || 65 ||
ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః |
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ || 66 ||
ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా || 67 ||
శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా |
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా || 68 ||
పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ |
అంబికాఽనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా || 69 ||
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా |
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా || 70 ||
రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా |
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా || 71 ||
రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా |
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా || 72 ||
కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా |
కళ్యాణీ జగతీకందా కరుణారససాగరా || 73 ||
కళావతీ కళాలాపా కాంతా కాదంబరీప్రియా |
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా || 74 ||
విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ |
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ || 75 ||
క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ |
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా || 76 ||
విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా |
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ || 77 ||
భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచనీ |
సంహృతాశేషపాషండా సదాచారప్రవర్తికా || 78 ||
తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోఽపహా || 79 ||
చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః || 80 ||
పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా |
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా || 81 ||
కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా |
శృంగారరససంపూర్ణా జయా జాలంధరస్థితా || 82 ||
ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ |
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా || 83 ||
సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా |
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా || 84 ||
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ |
నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ || 85 ||
ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ |
మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ || 86 ||
వ్యాపినీ వివిధాకారా విద్యాఽవిద్యాస్వరూపిణీ |
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ || 87 ||
భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః |
శివదూతీ శివారాధ్యా శివమూర్తిః శివంకరీ || 88 ||
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా || 89 ||
చిచ్ఛక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతిః సంధ్యా ద్విజబృందనిషేవితా || 90 ||
తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా |
నిఃసీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ || 91 ||
మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః |
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా || 92 ||
కుశలా కోమలాకారా కురుకుల్లా కులేశ్వరీ |
కులకుండాలయా కౌలమార్గతత్పరసేవితా || 93 ||
కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః |
శాంతిః స్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశినీ || 94 ||
తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ |
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ || 95 ||
సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా |
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ || 96 ||
వజ్రేశ్వరీ వామదేవీ వయోఽవస్థావివర్జితా |
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ || 97 ||
విశుద్ధిచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా త్వక్‍స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమహాశక్తిసంవృతా డాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాదిధరా రుధిరసంస్థితా || 100 ||
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్రవరదా రాకిణ్యంబాస్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా |
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా || 102 ||
రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా |
సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా |
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాఽతిగర్వితా || 104 ||
మేదోనిష్ఠా మధుప్రీతా బంధిన్యాదిసమన్వితా |
దధ్యన్నాసక్తహృదయా కాకినీరూపధారిణీ || 105 ||
మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాఽస్థిసంస్థితా |
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ |
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా || 107 ||
మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా |
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ || 108 ||
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా |
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ || 108 ||
సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ |
స్వాహా స్వధాఽమతిర్మేధా శ్రుతిః స్మృతిరనుత్తమా || 110 ||
పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా |
పులోమజార్చితా బంధమోచనీ బర్బరాలకా || 111 || [బంధురాలకా]
విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః |
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ || 112 ||
అగ్రగణ్యాఽచింత్యరూపా కలికల్మషనాశినీ |
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా || 113 ||
తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా |
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ || 114 ||
నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ |
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ || 115 ||
పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ |
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ || 116 ||
మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా |
మహనీయా దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలినీ || 117 ||
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా |
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా || 118 ||
కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా |
శిరఃస్థితా చంద్రనిభా భాలస్థేంద్రధనుఃప్రభా || 119 ||
హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా |
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ || 120 ||
దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః || 121 ||
దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ |
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా || 122 ||
కలాత్మికా కలానాథా కావ్యాలాపవినోదినీ |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || 123 ||
ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతిః |
అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా || 124 ||
క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ |
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ || 125 ||
త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా |
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా || 126 ||
విశ్వగర్భా స్వర్ణగర్భాఽవరదా వాగధీశ్వరీ |
ధ్యానగమ్యాఽపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా || 127 ||
సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ |
లోపాముద్రార్చితా లీలాక్లుప్తబ్రహ్మాండమండలా || 128 ||
అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా |
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా || 129 ||
ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ || 130 ||
అష్టమూర్తిరజాజైత్రీ లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా || 131 ||
అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా || 132 ||
భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా |
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభా గతిః || 133 ||
రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా || 134 ||
రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా || 135 ||
దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ |
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ || 136 ||
దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ |
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ || 137 ||
సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా |
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ || 138 ||
కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ |
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా || 139 ||
స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ |
సనకాదిసమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ || 140 ||
చిత్కలాఽఽనందకలికా ప్రేమరూపా ప్రియంకరీ |
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ || 141 ||
మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ |
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా || 142 ||
భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా |
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా || 143 ||
భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా |
రోగపర్వతదంభోలిర్మృత్యుదారుకుఠారికా || 144 ||
మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా |
అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ || 145 ||
క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ |
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా || 146 ||
స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః |
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా || 147 ||
దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా |
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా || 148 ||
వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ |
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ || 148 ||
మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః |
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా || 149 ||
సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణా |
కపర్దినీ కలామాలా కామధుక్కామరూపిణీ || 150 ||
కలానిధిః కావ్యకలా రసజ్ఞా రసశేవధిః |
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా || 151 ||
పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా |
పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ || 152 ||
మూర్తాఽమూర్తాఽనిత్యతృప్తా మునిమానసహంసికా |
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామిణీ సతీ || 153 ||
బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా |
ప్రసవిత్రీ ప్రచండాఽఽజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః || 154 ||
ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ |
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః || 155 ||
ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ || 156 ||
ఛందఃసారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ |
ఉదారకీర్తిరుద్దామవైభవా వర్ణరూపిణీ || 157 ||
జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకలాత్మికా || 158 ||
గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా |
కల్పనారహితా కాష్ఠాఽకాంతా కాంతార్ధవిగ్రహా || 159 ||
కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా |
కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ || 160 ||
అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ |
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా || 161 ||
త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ |
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః || 162 ||
సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా |
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ || 163 ||
ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ |
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ || 164 ||
విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ |
అయోనిర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ || 165 ||
వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ |
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా || 166 ||
తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థస్వరూపిణీ |
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ || 177 ||
సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ |
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా || 168 ||
చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా |
సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా || 169 ||
దక్షిణాదక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా |
కౌలినీకేవలాఽనర్ఘ్యకైవల్యపదదాయినీ || 170 ||
స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభవా |
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః || 171 ||
విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ |
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ || 172 ||
వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ |
పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ || 173 ||
పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ |
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ || 174 ||
ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ |
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా || 175 ||
బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ |
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ || 176 ||
సువాసిన్యర్చనప్రీతాఽఽశోభనా శుద్ధమానసా |
బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా || 177 ||
దశముద్రాసమారాధ్యా త్రిపురాశ్రీవశంకరీ |
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ || 178 ||
యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాఽంబా త్రికోణగా |
అనఘాఽద్భుతచారిత్రా వాంఛితార్థప్రదాయినీ || 179 ||
అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ |
అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపికా || 180 ||
ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా |
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ || 181 ||
శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా |
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః || 182 ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్రకథనం నామ ద్వితీయోఽధ్యాయః ||


|




|